కరోనా వైరస్ పై మీడియా ప్రతినిధుల అవగాహన
(పెన్ పవర్, ఉలవపాడు)
మండలంలోని మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో అంబేద్కర్ బొమ్మ సెంటర్‌లో గురువారం నాలుగు రోడ్లు కలిసే కూడలి వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎంపీడీవో టి రవికుమార్, ఎస్ఎ యం దేవకుమార్, పంచాయతీ కార్యదర్శి రాజ చంద్రశేఖర్ పాల్గొని మండలంలోని ప్రజలకు కరోనా వైరస్ పై విజయం సాధించుటకు ప్రజలను రోడ్లమీద తిరగనివ్వకుండా తిరగకూడదని ప్రజలకు తెలియజేస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా ఎప్పటికప్పుడు కడుక్కోవాలని, చేతులకు గ్లోజులు ధరించాలని, అందరూ ఇళ్లలోనే ఉండాలని, తప్పనిసరి పరిస్థితి అయితే మాస్కులు ధరించి బయటకు రావాలని, కొత్తవారిని కలవద్దని షేక్ హ్యాండ్ తీసుకోవద్దని, చేతులను శానిటైజ్ చేసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించాలని కరోనా వైరస్ ను అంతమొందించాలని ఒకరికొకరు అవగాహన కల్పించుకొని, ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తప్పనిసరిగా బయటికి వస్తే ఒకరికొకరు మీటర్ దూరంలో ఉండాలని ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ, మాస్కులు, గ్లోజులు, శానిటైజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామాల సింగారెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment