Followers

ఆర్యవైశ్యులు, వ్యాపార సంస్థల అసోసియేషన్ ఆధ్వర్యంలో 800 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ


 


ఆర్యవైశ్యులు, వ్యాపార సంస్థల అసోసియేషన్ ఆధ్వర్యంలో 800 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి 



(పెన్ పవర్, పొదిలి)


 



మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి పిలుపు మేరకు ఆర్యవైశ్యులు, వ్యాపార సంస్థల అసోసియేషన్ ఆధ్వర్యంలో 800 కుటుంబాలకు నిత్యావసరాలు సిద్ధం చేశారు. గురువారం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి స్థానిక అమ్మవారిశాలలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పొదిలి పంచాయతీ పరిధిలోని పేదలకు 14 రకాల వస్తువులు కల్గిన రూ.600 విలువ చేసే నిత్యవసర కిట్లను రూ.5.40 లక్షల విలువగల వాటిని సిద్ధం చేశారు. తొలి విడతగా 300 ప్యాకెట్లు పొదిలి 3, 4 సచివాలయంలో పంపిణీ కోసం పొదిలి పంచాయతీ ప్రత్యేక అధికారి దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇఓ బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మార్కెట్ యార్డు తరుపున ప్రతి ఇంటికి ఎఎంసి ఛైర్మన్ జి కోటేశ్వరి, జి శ్రీనులు అరటి పండ్లను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు యక్కలి శేషగిరిరావు, గునుపూడి చెంచు సుబ్బారావు(జిసి), భూమా రమేష్, కొత్తూరి శ్రీను, వేమా కృష్ణ, భూమా సుమంత్, వైసీపీ నాయకులు కల్లం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి, జి శ్రీను, ఉ డుముల పిచ్చిరెడ్డి, కంకణాల రమేష్ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...