ఈ దేశములో పుట్టిన ప్రతి ఒక్కరికి అన్నింటిలో సమాన హక్కులు కల్పించాలని రాజ్యాగం చెబుతుంటే, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయం. పద్దతిని చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలు ఇంకా బ్రతికే ఉన్నాయా అని సందేహం కలుగుతున్నది. నెల రోజుల క్రితం గుజరాత్ లో చిక్కుకున్నా 5,000 మంది మత్స్యకారులను స్వంత గ్రామాలకు పంపిచలేని ప్రభత్వాలు ఉన్నాయి. వారికి కనీస అవసరాలు తీర్చే పరిస్థితిలో కూడా లేవంటే ప్రభుత్వాలు ఎంత చిత్త సుద్దితో ఉన్నాయో గ్రహిచవచ్చు. అదే విదేశాలలో ఉండే డబ్బు ఉన్న వారి పిల్లలను విదేశాల నుండి వచ్చిన తరువాతా వారిని ఇంటికి పంపించే దానికి ఎంత శ్రద్ద తీసుకుంటున్నారో మీకు తెలియనిది కాదు. ఆ గుజరాత్ లో చిక్కుకున్నా పేద మత్స్యకారుల కోసం వారి గొంతుకై వినిపించడానికి మత్స్యకారుల కుటుంబాల ఆగ్రహానికి కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గురి కాక ముందే ఈ క్రింద డిమాండ్లను నెరవేరుస్తారని ఆసిస్తూ........
1. గుజరాత్ లో చిక్కుకున్నా 5,000 మంది మత్స్యకారులను యుద్ధ ప్రాతిపదికన ఆంధ్ర కి తరలించి వాల్లక్కు చికిత్స అంధించాలి.
2. గుజరాత్ లో చిక్కుకున్నా మత్స్యకార కుటుంబాలకు 25,000 రూపాయలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంధించాలి.
3. ఆకలి కేకలతో చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు 20 లక్షల రాష్ట్ర ప్రభుత్వం మరియు 30 లక్షలు కేంధ్ర ప్రభుత్వం, ఇంటికొక ఉద్యొగం ఇవ్వాలి.
4. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి మత్స్యకార కుటుంబాల స్తితి గతులను అధ్యయనం చేయాలి.
5. కేంధ్ర ప్రభుత్వం అటల్ బిహార్ నివాస్ యోజనా పథకం కిందా మత్స్యకార కుటుంబాలకు ఉచిత ఇల్లు కట్టించి ఇవ్వాలి.
6. సరైన సమయంలో ఆపదలను గుర్తించగా 5,000 మత్స్యకార కుటుంబాలను ప్రమాదంలో పడవేసి, ఇద్దరు మత్స్యకార మరణాలకు కారణమైన అధికారులను తక్షణమే విధులనుంచి తొలగించి వారి మీద చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకోవాలి.
No comments:
Post a Comment