కాంట్రాక్టు పద్దతిపై స్పెషలిస్టు వైద్యుల పోస్టులు భర్తీ
జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్
విజయనగరం, పెన్ పవర్ ః
కోవిడ్ ఆసుపత్రులలో ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేయుటకు స్పెషలిస్టు వైద్యుల పోస్టులు భర్తీ చేయనున్నట్లు జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 మంది అనస్దియాలజిస్ట్, 10 మంది పల్మనాలజిస్ట్, 10 మంది జనరల్ మెడిసిన్ వైద్యులను నియమించనున్నట్లు చెప్పారు. అనస్దియాలజిస్ట్ పోస్టుకు మాస్టర్ డిగ్రీ – ఎం .డి. లేక డిప్లొమా-డిఎ, పల్మనాలజిస్ట్ కు మాస్టర్ డిగ్రీ – ఎం .డి. లేక డిప్లొమా-డిటిసిడి, జనరల్ మెడిసిన్ (ఎం.డి) కు మాస్టర్ డిగ్రీ-ఎం.డి. అర్హతలు ఉండాలన్నారు. నెలకు రు.1.10 లక్షలు వేతనంగా ఇవ్వబడుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్దులు ఈనెల 30వ తేదీలోగా రెజ్యూమ్ ను dmhovzm@gmail.com మెయిల్ కు పంపాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో వాక్ ఇన్ ఇంటర్వూ కార్యక్రమం జరుగుతుందన్నారు.
No comments:
Post a Comment