Followers

రైతు భరోసా కేంద్రాలను ఈనెల 15కే సిద్దం చేయాలి


రైతు భరోసా కేంద్రాలను ఈనెల 15కే సిద్దం చేయాలి


ధాన్యం సేకరణ లక్ష్యాలను సాధించాలి


వీడియో కాన్పరెన్స్ లో జిల్లా కలక్టరు డా. హరి జవహర్ లాల్


 


        విజయనగరం,పెన్ పవర్ 


:  జిల్లాలో ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమేనని, రైతు సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలక్టర్ డా. హరి జవహర్ లాల్ వ్యవసాయాధికారులను ఆదేశించారు.  శనివారం కలక్టర్ మండల వ్యవసాయాధికారులతో పలు అంశాలపై వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆదేశాలు జారీచేసారు.  రైతు భరోసా కేంద్రాలను ఈనెల 30న ప్రారంభించనున్నామని, 15 నాటికే అన్ని సదుపాయాలతో సిద్దంగా వుంచాలని ఆదేశించారు.  ఇందులో ఏమైనా ఇబ్బందులుంటే నేరుగా కలక్టర్ నే సంప్రదించాలని సూచించారు.  విత్తనాల పంపిణీకి కావలసిన అంచనాలను తయారు చేసుకొని వాటికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలని, సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని అన్నారు.  రైతుల ఖాతాల్లోకి నేరుగా జమచేసే రైతు భరోసా ఆర్ధిక సహాయం కోసం లబ్ధిదారుల జాబితాలను ఈనెల 10లోగా వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.  పురుగు మందులు, ఎరువుల సరఫరాకు కూడా లబ్ధిదారుల జాబితాలను ఈనెల 5 లోగా సిద్దం చేసుకోవాలన్నారు.  ఇటీవల సంభవించిన అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాలను అంచనావేసి మే 5లోగా లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాలన్నారు.  గత ఏడాది ఆగస్ట్, అక్టోబరు నెలల్లో జరిగిన పంట నష్టాల లబ్ధిదారులను మరోసారి వెరిఫై చేసి ఈనెల 10లోగా జాబితాలను పంపాలన్నారు.


 


      ధాన్యం సేకరణ లక్ష్యాలను సాధించాలి: జిల్లాలో ధాన్యం సేకరణకు ఈ రబీ కోసం 45 సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసామని, 32 వేల మెట్రిక్ టన్నుల సేకరణకు లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు.   గ్రామస్ధాయి వ్యవసాయ సహాయకుల సహకారంతో  గ్రామాల్లో టాంటాం వేయించి గత ఏడాది కంటే ఎక్కువ సేకరించేలా చూడాలన్నారు. 


 


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  సంయుక్త కలక్టరు జి.సి. కిషోర్ కుమార్, సంయుక్త కలక్టరు- 2  ఆర్. కూర్మనాధ్, వ్యవసాయ శాఖ  సంయుక్త సంచాలకులు ఎం . ఆశాదేవి, వ్యవసాయ ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు మండలాల నుండి వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...