యువత ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనాలి...
పౌరవేధిక చైతన్య సదస్సులో భీశెట్టి పిలుపు
పెన్ పవర్,విజయనగరం
జిల్లా జరగనున్న మునిసిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా అంతటా ఓట్లు ఉన్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలని జిల్లా పౌరవేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు శనివారం ఉదయం ఉమాభారతి డిగ్రీ కళాశాలలో ఎన్నికలు యువత పాత్ర అనే అంశం పై పౌరవేధిక ఆధ్వర్యంలో చైతన్య సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న భీశెట్టి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బ్రతికించాలనే తపన యువతీ యువకులకు ఉండాలని నచ్చిన అభ్యర్థులకు ఓటును వేసుకునే అవకాశం తో పాటుగా నచ్చకపోతే నోటా కి ఓటు వేసే అవకాశం మన రాజ్యాంగం కల్పించిందని ప్రతి విద్యార్థి తమ కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ ఓట్లు వేసేలా చూడాలని కోరారు పౌరవేధిక ప్రతినిధి ఎస్.శివాజీ మాట్లాడుతు ఎన్నికలను యువతి యువకులు పట్టించుకోకుండా ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయని నచ్చినవారికి ఓటు వేయాలని లేకపోతె కనీసం నోటా కి ఓటు వేసి తమ నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని అన్నారు ఓటు ని వజ్రాయుధం గా గుర్తించాలని కోరారు, జిల్లా క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి కో కన్వీనర్ మమ్ముల తిరుపతి మాట్లాడుతూ మంచి రాజకీయాలు కావాలంటే మంచి వ్యక్తులు గెలుపొందలని అందుకే అందరూ రాజకీయాలు పట్టించుకోవాలని ఓటర్ లిస్టులో పేరు ఉందొ లేదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన లిస్టులో చూసుకొని ఓటు వేయాలని కోరారు,విద్యాసంస్థల అధినేత బి. ఏ.రావు అధ్యక్షత న జరిగిన సమావేశంలో వేదిక ప్రతినిధులు ఇప్పల వలస గోపీ, బసవ మూర్తి,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment