సమీకృత వ్యాపార సముదాయాలకు స్థల పరిశీలన చేసిన అడిషనల్ కలెక్టర్..
మల్లంపేట్ సర్వేనెంబర్ 258లో..దొమ్మర పోచంపల్లి 199లో స్థలాన్ని ఎంపిక..
దుండిగల్,పెన్ పవర్
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.జాన్ శాంసన్.. దుందిగల్ పురపాలక సంఘం పరిధిలోని దొమ్మర పోచంపల్లిలో సర్వేనెంబర్ 199 లో.. మల్లంపేట్ సర్వేనెంబర్ 258లో చేపట్టబోయే సమీకృత వ్యాపార సముదాయం నిర్మాణానికి కావలసిన స్థల పరిశీలన చేశారు..ఈవ్యాపార సముదాయాల వల్లన ఒకేచోట నిత్య అవసరాలు వివిదరకాల వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు సమీకృత వ్యాపార సముదాయాలు ఎంతగానో ఉపయోగపడుతాయి..ఈ కార్యక్రమములో చైర్ పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ, మున్సిపల్ కమీషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి..గండిమైసమ్మ మండల సర్వేయర్, గండిమైసమ్మ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ షణ్ముఖం మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు,
No comments:
Post a Comment