వైసీపీ ప్రజల ప్రభుత్వం....
పెన్ పవర్,విజయనగరం
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, గత తెలుగుదేశం ప్రభుత్వం మాటలే కాని, చేతలు లేవని ఈ తేడాను ప్రజలందరూ గమనించాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం నాడు తన నివాసంలో పూల్ బాగ్ కాలనీ మూడవ వార్డు కు సంబంధించి బాబామెట్ట గట్టు ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పడగల అప్పారావు, బమ్మిడి పెద్ద బాబ్జి, అయిత ప్రసాద్, ఇప్పిలి కిషోర్, ఎల్లమ్మ, పైలు వరలక్ష్మి ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వంద కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి ఎమ్మెల్యే కోలగట్ల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నేటి నుంచి మీరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, మీ గౌరవం పెరిగే విధంగా తమ ప్రవర్తన ఉంటుందన్నారు. అందరినీ కలుపుకొని వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, వేముల కృష్ణవేణి విజయానికి కృషి చేయాలన్నారు. కేవలం ఎన్నికల ముందు కనపడే నాయకులు , మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి, బంగ్లా లో ఎవరిని కలవాలో తెలియని అనిశ్చిత పరిస్థితి తెలుగుదేశం పార్టీలో మీరు చూసారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు అన్ని విధాల తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయి ఎమ్మెల్యే కోలగట్ల వారికి భరోసా ఇచ్చారు. కులం పేరు చెప్పుకొని మూడు సార్లు చైర్ పర్సన్ గా చేసిన గత తెలుగుదేశం పాలకులు, సమస్యలు తీర్చాలి అనే ఆలోచన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. తాను శాసనసభ్యునిగా పదవీ పగ్గాలు చేపట్టిన సంవత్సర కాలంలో మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి , వేసవిలో కూడా మంచినీటి సమస్య లేకుండా కృషి చేస్తున్నాం అన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ప్రజలు మనసుపెట్టి ఆలోచన చేయాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పాలకులు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు అని ప్రశ్నించారు. ప్రజలను అమాయకులను చేసి, ఓట్ల ద్వారా పదవులు పొంది, ఆ తరువాత చేతులెత్తేసి ప్రజలను అధోగతి పాలు చేసింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో అశోక్ బంగ్లాకు తాళాలు వేసుకున్నారని, విజయనగరం ప్రజలు కరోనాతో భయభ్రాంతులు గురవుతుంటే, ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత గా ,ప్రజా ప్రతినిధిగా తాను ప్రజలకు అండగా ఉంటూ కరోనా బాధితులకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. శాసనసభ్యునిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం అన్నారు. సుదీర్ఘ కాలం శాసన సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు ప్రజలను ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. సామాన్య కార్యకర్త గా జీవితాన్ని ప్రారంభించిన తాను, అశోక్ గజపతి రాజు పై తాను గెలిచాం అంటే అది కార్యకర్తలు, ప్రజల అభిమానంతోనే అని అన్నారు. శాసనసభ్యునిగా కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా నగర అభివృద్ధికి కృషిచేసిన వాస్తవాన్ని ప్రజలందరూ గ్రహించాలన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మూడో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల రాంప్రసాద్, మెండ వెంకటరమణ, జగదీష్ మాస్టారు, గండ్ర టీ సన్యాసిరావు, వేముల ప్రకాష్, కోట మంతి శ్రీను, దారపు సన్ని బాబు, సంతోష్, సంచా న ఆది, బండి రమేష్, లా వా డ శ్రీను, లతోపాటు మహిళలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment