Followers

ఆజాద్ ఆశయ సాధనలో బాగస్వాములవుదాం

 ఆజాద్ ఆశయ సాధనలో బాగస్వాములవుదాం

కూకట్ పల్లి,పెన్ పవర్


మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కె.పి.హెచ్.బి కాలని మూడో ఫేస్ కట్టా వారి సేవా కేంద్రం వద్ద శనివారం భారతీయ ఉద్యమకారుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్  వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కె.పి.హెచ్.బి కాలనీ 114డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొల్లా శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భముగా కొల్లా శంకర్, మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కట్టా నరసింగరావు మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆజాద్ జీవించినది 25సంవత్సరాలే అయినా స్వాతంత్ర ఉద్యమ కాలంలో  భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లతో కలిసి భారత స్వాతంత్రం కొరకు పాటుపడిన గొప్ప నాయకుడని, అతిచిన్న వయసులో దేశం కోసం పాటుపడి ప్రాణత్యాగం చేసారని, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నాల సహచరుడని, చంద్రశేఖర్ ఆజాద్ కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడుగా, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, శత్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న  అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడయ్యాడని, చంద్రశేఖర్ ఆజాద్ను గుర్తు చేసుకుని ఆయన ఆశయాల సాధనలో మనమందరం భాగస్వాములమవుదామని అన్నారు. ఈ కార్యక్రమములో ముప్పాల్ల సాంబశివరావు, గోపరాజు శ్రవణ్ కుమార్, కలకొండ నరేష్, సందీప్, నరేష్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...