గడప గడపకు ఎన్నికల ప్రచారంలో వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్
పెన్ పవర్ న్యూస్ విశాఖపట్నం సీటీ
21 వార్డ్ పరిధిలో గల కోటక్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా పరిధిలో గల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి తగు సూచనలు చేస్తూ, వాటి పరిష్కారానికి హామీ ఇస్తూ, ఫ్యాన్ గుర్తు పై ఓటు వేయాలని కోరారు. విశాఖలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చేయుటకు రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి ప్రణాళిక సిద్ధం చేసారని అన్నారు. అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు చేరుటకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డ్ లో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment