Followers

ల్యాబ్ టెక్నిషన్ పోస్ట్ భర్తీ చేయాలి...

ల్యాబ్ టెక్నిషన్ పోస్ట్ భర్తీ చేయాలి...

గిరిజన సంఘం డిమాండ్

 పెన్ పవర్, విశాఖపట్నం

కొత్త కోట ప్రదమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నిషన్ పోస్ట్ ను తక్షణం భర్తీ చేయాలని గిరిజన సంఘం డిమాండ్ చేసింది. శనివారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్   సాధన కమిటీ ఆధ్వర్యంలో కొత్తకోట పి.హెచ్.సి వద్దా ధర్నా జరిగింది. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కొత్తకోట పీహెచ్ సీ  పరిధిలో 10 పంచాయతీలు, 28 గిరిజన గ్రామాలు 30 వేల జనాభా కు వైద్య సేవలు అందించడం కోసం ప్రత్యేకంగా కొత్తకోట పి.హెచ్.సి ఏర్పాటు చేశారు.వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చుపెడుతుంది   ప్రభుత్వం.  వాస్తవానికి ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేయవలసి ఉంది,  అలాగే ప్రతి శనివారం వందలాది మంది ప్రజలు వైద్యం కోసం కొత్తకోట పి.హెచ్.సి ఏర్పాటు చేశారు, ఇక ల్యాబ్ విషయం కు   వస్తే ల్యాబ్ టెక్నీషియన్ లేరని, వైద్యం చేసి పంపిస్తున్నారని,పరీక్షలు మాత్రం ప్రైవేట్ లాబ్ లలో  చేయంచుకోమని  అలా చేసుకుంటే చేయాలంటే వందల రూపాయలు ఖర్చవుతుందని,ఈ పి హెచ్ సి.ప్రధానంగా టి అర్జాపురం. చీమలపాడు గ్రామాల్లో... గిరిజనులు మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు బారిన పడుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో గిరిజనుల వద్ద డబ్బు లేకపోవడంతో. వస్తువులు తాకట్టు పెట్టుకుని ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ వద్ద పరీక్షలు నిర్ణయించుకుంటున్నారు.  వాస్తవానికి ఆరోగ్య కమిటీ ఎంపీడీవో అధ్యక్షతన ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు జరగాలి. ఈ సమావేశంలో హాస్పిటల్ యొక్క స్టాప్. ఇటువంటి సౌకర్యం ఉండాలని చర్చించి ఆస్పత్రి అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టాలి. నేటికీ మూడు సంవత్సరాలు అవుతున్న ప్రత్యేక అధికారులు పరిపాలనలో ఈ ఆస్పిటల్ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పేషెంట్లు మంచినీరు తాగాలంటే  గ్లాసులు కూడా లేవు. తక్షణమే జిల్లా వైద్య అధికారులు స్పందించి రెండు వారాల్లోగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కె గోవిందరావు గిరిజనసంఘం మండల అధ్యక్షులు సిహెచ్ శంకర్రావు. సిహెచ్ రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...