పార్వతీపురం వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు
పార్వతిపురం,పెన్ పవర్
పార్వతిపురం నియోజకవర్గ కేంద్రంలో గల ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ గారు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, విజయనగరం జిల్లా ఏమ్ఎల్సి పెనుమత్స సురేష్ బాబు మరియు విజయనగరం జిల్లా వైసీపీ సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ గారు, విజయనగరం జిల్లా డిసిసిబి చైర్మన్ మరిశర్ల తులసి తదితర ముఖ్య అతిదిలును గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు సాదరంగా ఆహ్వానించడం జరిగినది. అందరూ కార్యాలయంలో కాసేపు ముచ్చటించి త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించి అన్ని వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులను అఖండ విజయం చేకురేవిదంగా కృషి చేయాలని పార్టీ ముఖ్య నాయకులుకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుతో పాటుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, వైసీపీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేయు అభ్యర్థులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment