Followers

ఈ నెల 26న జరిగే భారత్ బందును విజయవంతం చేయండి

 ఈ నెల 26న జరిగే భారత్ బందును విజయవంతం చేయండి    









  పెన్ పవర్, కందుకూరు

 కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆధ్వర్యంలో మార్చి 26న భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక కందుకూరు సుందరయ్య భవన్ లో గుడ్లూరు ప్రాంతీయ  ప్రజా సంఘాలు బంద్ వాల్ పోస్టర్ ను మంగళవారం నాడు ఆవిష్కరణ చేశారు. పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జీ వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్ లు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా ఉన్న బ్యాంకులను, ఎల్ఐసి,జిఐసీ,  రైల్వే, ఆయిల్, గ్యాస్, ఓడరేవులు, విమానయానం, విద్యుత్తు రవాణా రంగాలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తుంది. కార్మిక హక్కులను కాలరాస్తుంది. భూములను కార్పొరేట్లకు అప్పజెప్పడానికి మూడు రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చింది, ఐదు కోట్ల మంది ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు వెళుతుంది. ఈ విధానాలు  అమలు జరిగితే రైతులు కార్మికులు సామాన్య ప్రజల పైన భారాల పడి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కావున ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 26న జరిగే భారత్ బంద్ లో రాజకీయాలకతీతంగా ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ అరుణ్ కుమార్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు దామాకృష్ణయ్య, లింగసముద్రం మండల రైతు నాయకులు మన్నెం మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం ఉలవపాడు మండల నాయకులు ఏలూరు నాగార్జున, కెవిపిఎస్ నాయకులు మెన్నెం రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...