రెండు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ నిర్వహించిన ఎంపీడీవో టి. రవి కుమార్
పెన్ పవర్,ఉలవపాడుఉలవపాడు పరిధిలోని కోడూరుపాడు ఆత్మకూరు ఎస్సీ కాలనీ లో అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం నాడు ఎంపీడీవో టి రవి కుమార్ . డాక్టర్ కె శ్రీనివాసరావు. అంగన్వాడీ సెంటర్లలో రిజిస్టర్ లను పరిశీలించి పిల్లలు సంఖ్య 11 మందికి గాను 6 గురు పిల్లలు మాత్రమే హాజరు అయ్యారని మరియు ఒక గురు గర్భవతులు మొత్తం 17 మంది గా గుర్తించి వారికి అందవలసిన అన్ని సదుపాయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే రిజిస్టర్లు లను పరిశీలించారు. అనంతరం కరోనా వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా గతంలో కొల్లూరు పాడు మరియు ఆత్మకూరు. గ్రామాలలో కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్నందున సెకండ్ టైం కరోనా పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్కు తప్పని సరిగా ధరించాలి. శానిటైజర్ వాడాలి. భౌతిక దూరాన్ని పాటించాలి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా వర్కర్లకు వివరించారు. ఆత్మకూరు గ్రామంలో 45 సంవత్సరాలు పైబడిన వారు 37 మంది 65 సంవత్సరాలు పైబడిన వారు 54 మంది మొత్తం 91 మందిని గుర్తించారు వారికి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని అని 100% ఏజీ పూర్తిచేయాలని వైద్య సిబ్బందికి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు అమ్మనబోలు సావిత్రి. నారాయణమ్మ. ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment