Followers

కందుకూరు లో ఎల్ ఐ సి ఏజెంట్లు ధర్నా

 కందుకూరు లో ఎల్ ఐ సి ఏజెంట్లు ధర్నా    

 పెన్ పవర్, కందుకూరు  

 మార్చి 23వ తేదిని ఎల్ ఐ సి ఆల్ఇండియా (లియాఫి) ఏజెంట్ల రెస్ట్ డే గా ప్రకటించారు.కావున కందుకూరు బ్రాంచి ఏజెంట్లు అందరూ ఈ  కార్యక్రమంలో అన్ని రకాలసర్వీసులు ఆపి రెస్ట్ డే కి , అన్ని రకాలుగా నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కస్టమర్లకు మరియు ఏజెంట్లకు ఉన్న సమస్యలమీద వాటిని పరిష్కరించ వలసినదిగా కోరారు.ఏజంట్లు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమమంలో పాల్గొన్నారు.ఎల్ఐసి పాలసీ దారులకు బోనస్ పెంచాలని , పాలసీలకు జి యస్ టి తొలగించాలని , మరియు పాలసీ లోన్ పై వడ్డీ రేట్లు తగ్గించాలని డిమాండ్ వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో లియాఫి నాయకులు, ఏజెంట్లు యాదాల శ్రీను, మోదడుగు వెంకటేశ్వర్లు,రవ్వా శ్రీనివాసులు,కమ్మ కోటేశ్వరరావు. కె.నరసింహం తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...