కందుకూరు లో కరోనా కలకలం
పెన్ పవర్, కందుకూరు
కందుకూరు లో కరోనా మహమ్మారి మళ్ళీ వ్యాప్తి చెందుతుంది.ప్రశాతం గా ఉన్న పెద్ద బజార్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఇంటి నుండి ఉద్యోగం నిర్వహిస్తున్న ఆ యువకునికి మంగళవారం జ్వరం రావడంతో కందుకూరు ఏరియా ఆస్పత్రికి వెళ్లి కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇంటి నుండే ఉద్యోగం నిర్వహిస్తున్న అతను శనివారం సినిమాకు వెళ్లినట్లు గా సమాచారం.కావున ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాను వేయించుకొని, మాస్క్ ధరిస్తూ, శానిటైజర్ ఉపయోగిస్తూ, భౌతిక దూరం పాటిస్తూఉండి కరోనా బారిన పడకుండా ఉండాలని ఆరోగ్య శాఖ వారు తెలియజేస్తున్నారు.
No comments:
Post a Comment