Followers

వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటికి ఇబ్బంది లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు

వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటికి ఇబ్బంది లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు

విజయనగరం,పెన్ పవర్

 వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటికి ఇబ్బంది లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ వర్మ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం నెల్లిమర్ల వద్దనున్న  రిజర్వాయర్ ను పరిశీలించారు. చంపావతి నీటి సామర్థ్యం తగ్గిపోవడాన్ని గమనించారు. దీంతో ఆండ్ర జలాశయం నుంచి తాగు నీటిని విడుదల చేయించేందుకై విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ సూచనల మేరకు ఆండ్ర జలాశయం ఇరిగేషన్  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో కమిషనర్ సంప్రదింపులు చేశారు. ఆండ్ర నుంచి నీరు విడుదల అయిన వెంటనే నీటి సామర్థ్యం పెంపుదలకు తగు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు. అయితే ప్రజలు కూడా నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని తెలిపారు. ఎక్కడైనా  పైప్ లైన్ లకు లీకేజ్ లు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇప్పటికే కుళాయిల హెడ్ లు పాడైనవి మార్చే చర్యలు ముమ్మరం చేసామన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...