ఈ అసెంబ్లీ సమావేశం లోనేగల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
రాష్ట్ర ప్రధానకార్యదర్శి అమరగొండ తిరుపతి
పెన్ పవర్, జగిత్యాలతెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాలలో గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లు కేటాయిస్తూ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చెయ్యాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరకొండ తిరుపతి గౌడ్ డిమాండ్ చేశారు. బొగ్గుబాయి,బొంబాయి,దుబాయ్ వలసలు వెళ్లిన కార్మికుల కోసం ప్రభుత్వం భూములు అమ్మి వారికి తెలంగాణ రాష్ట్రంలో నే ఉపాధిని కలిపిస్తామని 2014 సం" కెసిఆర్ చెప్పిన మాటలు మర్చిపోకుండా మాట మీద నిలుచోవాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన 15 లక్షల మంది కార్మికులు వేతనాలు పంపడం వలన ప్రభుత్వానికి రెండు వేల కోట్లు ఆదాయం వస్తోందని రాష్ట్ర సంక్షేమం కోసం మావంతు గా మేము తోడ్పడుతున్నామన్నారు అది మరిచి గల్ఫ్ కార్మికుల పై చిన్న చూపు చూస్తున్నారని ఆవేదం వ్యక్తపరిచారు. జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో తప్పకుండా గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లు కేటాయించి సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయాలి అన్నారు లేని పక్షాన మా ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం గల్ఫ్ కార్మికులు చేసిన ఉద్యమాన్ని మర్చిపోకూడదు మాకు ఉద్యమలు చెయ్యడం కొత్త కాదు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కల్లెడ భూమన్న గౌరవ అధ్యక్షులు సేపూరి గోపాల్ , వర్కింగ్ ప్రెసిడెంట్ సంద సుదర్శన్ ఉపాధ్యక్షులు పెరుగు మల్లికార్జున్ కన్వీనర్ పురంశెట్టి నాగేష్, అధికార ప్రతినిది రాజు గౌడ్ ఎరుకల, ముఖ్య సలహాదారులు ఎం.డి హస్సన్ కార్యదర్శులు అమరగొండ మల్లేష్ జునుగురి నాగరాజు పాల్గొన్నారు.

No comments:
Post a Comment