పరిగి లో భగత్ సింగ్ 90 వ వర్ధంతి వేడుకలు
వికారాబాద్ , పెన్ పవర్పరిగి యందు భగత్ సింగ్ 90 వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి ప్రధాన కార్యదర్శి కె హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ భగత్ సింగ్ 1907లో జన్మించి 1930 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైల్ యందు ఉరితీయబడ్డారు. అప్పటికి అతని వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. మనదేశంలో బ్రిటిష్ వారి పరిపాలనలో స్వాతంత్ర పోరాటం చేసి ఫ్రీడమ్ ఫైటర్ గా పేరు తెచ్చుకొని బ్రిటిష్ వారిని ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి వారిని మనదేశం నుంచి వెళ్లగొట్టడానికి అనేక పోరాటాలు చేసిన మహానీయుడు. కేవలం 23 సంవత్సరాల వయసులోనే దేశ ప్రజల శ్రేయస్సు గురించి అనేక పోరాటాలు చేసిన మహనీయుడి భగత్ సింగ్ తో పాటు రాజ్ గురు, సుఖ్ దేవ్ ముగ్గురిని ఒకే సారి ఉరి తీశారు. ఆ తర్వాత ఆయనను ఆదర్శంగా తీసుకొని 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేశారు భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకొని అనేక మంది యువకులు వారి ఆశయాల గురించి పోరాటం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ శ్రీనివాస్, మల్లేష్ యాదవ్, ఎర్రగడ్డ పల్లి జగన్, రామకృష్ణారెడ్డి,డిసిసి ఆర్గనైజింగ్ సెక్రెటరీ రామచంద్రయ్య యాదవ్, బెస్త ఆంజనేయులు, డి సి సి నాయకులు బండలింటి మైపాల్, జగన్ సెట్, శివ కుమార్, గని, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment