ఒక్కరోజు ముందు అడ్డుకోవడం అప్రజాస్వామికం
- అసెంబ్లీ ముట్టడి చేయకుండా ముందస్తు అరెస్టులు
- కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హౌస్ అరెస్ట్
వేములవాడ, పెన్ పవర్
ఒక్కరోజు ముందు అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆది శ్రీనివాస్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం రోజున ఛలో అసెంబ్లీకి వెళ్లకుండా ఉండాలని పోలీసులు కోరారు. పోలీస్ అధికారులతో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.ఛలో అసెంబ్లీ ప్రకటన చేసిన వెంటనే పోలీసులు తమ పార్టీ నాయకులను ఎక్కడికక్కడే అరెస్టు చేయడం పౌర హక్కులకే భంగమని అన్నారు. ఓవైపు అసెంబ్లీ నడుస్తుంటే వేములవాడ నియోజకవర్గం నుండి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాళ్సిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అందుబాటులో లేడు కాబట్టి ఈ వేములవాడ ప్రాంత సమస్యలు ప్రధానంగా జూన్ 18- 2015న వేములవాడ రాజన్న ఆలయానికి 450 కోట్లతో అభివృద్ధి చేస్తానని ఏటా 100 కోట్లు బడ్జెట్ లో పెడతానని ఇచ్చిన హామీని విస్మరించిన కేసీఆర్ ముఖ్యమంత్రికి సమస్య తెలపడానికి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెంటనే నిధులు మంజూరు చేసి రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అలాగే అదేరోజు ముంపు గ్రామాల నిర్వాసితులకు డబుల్ బెడ్రూం నిర్మాణానికి 5 లక్షల 4 వేల రూపాయలు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి మరిచారని గుర్తు చేశారు. ఆ హామీ ఏమైంది అని అడగడానికి ఈ చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే కథలాపూర్ మేడిపల్లి మండలాల ప్రజల రైతుల వర ప్రదాయిని కలికోట సూరమ్మ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఆ పనులు జరుగుతూలేనందున వెంటనే పనులు మొదలు పెట్టాలని ఈ చలో అసెంబ్లీ పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. ఇంకా సమస్యలు అనేకం ఆర్డీవో కార్యాలయం మంజూరు చేశారు పేరుకే ఆ కార్యాలయం ఎప్పుడు ప్రారంభిస్తారని సూటిగా ప్రశ్నించారు. వేములవాడ ఆలయ సమీపంలో కూలిన బ్రిడ్జి ని ఎప్పుడు నిర్వహిస్తారని అడగడం తప్పా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుద్రంగి లో 30 పడకల ఆసుపత్రి ఎప్పుడు మంజూరు చేస్తారో అడగటానికి అసెంబ్లీ ముట్టడి చేస్తామని అన్నారు. చందుర్తి మోత్కూర్ రావు పేట లో ఆగిపోయిన రోడ్డు పనుల కోసం అటవీ అనుమతులు రావడానికి కోసం ఇంకెన్నాళ్ళు ఓపిక పడతామని ఎద్దేవా చేశారు. కోనరావుపేట మేడిపల్లిలో కథలాపూర్ మండలాలలో అర్థంతరంగా ఆగిపోయిన బ్రిడ్జి పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. వేములవాడ నియోజకవర్గం లో ఒకటి లేదా రెండు గ్రామాలలో తప్ప మిగితా గ్రామాలలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు అయినప్పటికీ పనులు జరగనందున వెంటనే ఆ పనులు జరపాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల లో నిర్వాసితుల కొరకు పరిశ్రమలను వెంటనే పెట్టాలని ఆయా గ్రామాలలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నత చదువుల కొరకు డిగ్రీ కళాశాలలో పీజీ కళాశాలలను నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో నెలకొల్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ఇంకా ఇవ్వలేదు కాబట్టి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాన సమస్యలు అసెంబ్లీలో ప్రశ్నించే ఎమ్మెల్యే లేక ఈ ప్రాంతంలో ఏడాది కాలమైంది కాబట్టి ఈ సమస్యలు చెప్పడానికి ఛలో అసెంబ్లీ కి వెళ్తే తప్పా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని పరిపాలన సాగించడం సిగ్గుచేటుగా భావిస్తున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని ఆ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వేములవాడలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. చెత్త తీయకున్న, చెట్టు పెట్టకున్న సమావేశాలు సకాలంలో పెట్టకున్న సర్పంచులను కౌన్సిలర్లను సస్పెండ్ చేస్తామని చెబుతున్న ఈ ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తుంది ఇది ప్రజలకు సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఇంకా ఎన్నాళ్ళు ప్రశ్నించే గొంతును అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు.
No comments:
Post a Comment