విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
త్వరలోనే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తాం
మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు
వేములవాడ, పెన్ పవర్
వేములవాడ మున్సిపల్ లో విలీనమైన గ్రామాల అభివృద్ధిపై తాము ప్రత్యేక శ్రద్ధ పెట్టామని వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు చెప్పారు.మంగళవారం శాలరామన్న పల్లె 6వ వార్డు లో 13 వ ఆర్థిక సంఘం నిధుల నుండి మంజూరైన రూ. 5.60 లక్షల రూపాయలతో సీసీ డ్రైనేజ్ , నాంపల్లి లోని శాంతి నగర్ జీవధార హాస్పిటల్ లో రూ. 7 లక్షల రూపాయలతో సీసీ డ్రైనేజీ పనులకు కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవిరాజు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ. 80 లక్షల తో విలీన గ్రామాలైన 5 ,6,7 ,8 వ వార్డులలో అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు.అంతేకాకుండా కోనాయిపల్లి, అయ్యోరుపల్లి,శాత్రాజ్ పల్లెలో దాదాపు రూ. ఒక కోటి తో అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని... త్వరలోనే అభివృద్ధి పనులకు ప్రారంభిస్తామని తెలిపారు.పట్టణంలో కూడా దాదాపు 2 కోట్ల పనులకు టెండరు పూర్తయ్యాయని, అభివృద్ధి పనులు కూడా త్వరలోనే భూమి పూజ చేసి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని చెప్పారు.మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి ప్రతి ఇంటి కి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు జీవధార హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment