భారత్ కా అమృత మహోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయండి
మందమర్రి, పెన్ పవర్
దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన భారత్ కా అమృత మహోత్సవ కార్యక్రమాలను సింగరేణి అధికారులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. అమృత మహోత్సవలలో భాగంగా సింగరేణి సేవ సమితి ద్వారా ఉత్పత్తి చేసిన చేతి వృత్తుల స్టాల్స్ లను గురువారం ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో ఆయన, సేవ సమితి అధ్యక్షురాలు చింతల లక్ష్మి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సేవ స్టాల్సు సేవ మహిళల ఉపాధికి దోహదపడుతాయన్నారు. సింగరేణి వ్యాప్తంగా జూన్ 30 వరకు భారత్ కా అమృత మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం పర్యావరణ విభాగం వారు నార సంచులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, టీబీజీకేఎస్ స్టృక్చర్ కమిటీ సభ్యులు శంకర్ రావు, సేవ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్, డివైపిఎం రెడ్డిమల్ల తిరుపతి, ఏరియా పర్యావరణ అధికారి ప్రభాకర్, ఎస్ అండ్ పిసి ఎస్ఎస్ఓ రవి, స్పోర్ట్స్ సూపర్వైజర్ హెచ్ రమేష్, సేవ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్లు నెల్సన్, నస్పూరి తిరుపతి, తుమ్మల సంపత్, సేవ సభ్యులు, ఫ్యాకల్టీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




No comments:
Post a Comment