Followers

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

 ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

మందమర్రి,  పెన్ పవర్

రాష్ట్రంలో కరోనా ఉదృతిని మరల పెరిగే అవకాశం కానవస్తుండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చార్టర్ అధ్యక్షులు, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ సొత్కు సుదర్శన్, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ పోలు శ్రీనివాస్ లు పేర్కొన్నారు. గురువారం మందమర్రి మార్కెట్ లో లయన్స్ క్లబ్ మందమర్రి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోన బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ, తరచూ శానిటైజర్ వాడాలని సూచించారు. ప్రజల సంక్షేమం కొరకు లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో    కార్యదర్శి కౌట్ల అనిత, కోశాధికారి ఆరుసవెళ్లి శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు కొక్కుల కేదారి, డైరెక్టర్ డొక్కు శ్రీనివాస్ రావు, సభ్యులు తౌటం  శ్రీనివాస్, పెండ్యాల గౌతం, తాడెపు శ్రీనివాస్, కడలి శ్రీనివాస్, దుమ్మని సత్యనారాయణ, కొక్కుల మధు, పూసాల వెంకట రత్నం, నర్సొజి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...