చిట్యాల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశించిన జిల్లా కలెక్టర్
వనపర్తి, పెన్ పవర్తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు. గురువారం వనపర్తి మండలం చిట్యాల దగ్గర నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మొదటి దశలో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు కల్పించడమే కాక పార్కింగ్ సదుపాయం, సిసి రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరగా పూర్తి చేస్తే పేద ప్రజల కల నెరవేరి త్వరగా అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ సందర్శించారు. సిసి రోడ్లు డ్రైనేజీ మరుగుదొడ్లు కాంపౌండ్ వాల్ ఆర్చి పనులను పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు తాగునీరు ఇతర వసతులు కల్పించాలని మార్కెటింగ్ అధికారికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అమరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి సింగ్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment