Followers

మౌలిక సదుపాయాలు కల్పించాలని రేచిని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా

 మౌలిక సదుపాయాలు కల్పించాలని రేచిని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా


తాండూర్, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామ పంచాయతీలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పంచాయతీ పాలక వర్గం విఫలమైనందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేచిని గ్రామ పంచాయతీ  కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం  ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని పంచాయతీ కార్యదర్శి వసంత గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపెల్లి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ  గ్రామంలో వీధి దీపాల నిర్వహణ సరిగ్గా లేదని, చెత్త సేకరణ కొన్ని వార్డులకే పరిమితం అయినదని, గ్రామంలోని 12 వార్డులలో చెత్త సేకరణ చేపట్టాలని, గ్రామంలో గ్రంథాలయం లేకపోయినా, ప్రజలు నుంచి గ్రంథాలయం వినియోగ పన్ను కట్టించుకుంటున్నారు కావున వెంటనే గ్రంథాలయం అలాగే పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని, గతంలో ప్రభుత్వం పేదలకు నివాసానికి కేటాయించిన కాలనీలో నీటి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. లేనియెడల ప్రజలు పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని ఉదృతం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మొగిలి తిరుపతి, బీసీ మోర్చా మండల ఉపాధ్యక్షుడు అదే శ్రీనివాస్, నాయకులు బామనపెల్లి ఆనంద్,రాజశేఖర్,శంకర్, సంతోష్, గురుగుల రాజన్న,గురుగుల శ్రీనివాస్ మహిళలు శారద, కళ్యాణి, ప్రమీల, భాగ్యలక్ష్మి, రాధ,మల్లేశ్వరి మరియు పలుగురు గ్రామస్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...