పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి
పెన్ పవర్, కందుకూరు
పొగాకు రైతులకు ఈ సంవత్సరం అధిక వర్షపాతం వల్ల పెట్టుబడి ఎక్కువైందని కావున ప్రారంభ ధర 200 రూపాయలు గా ఉండాలని పొగాకు రైతుల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ మాదాల వెంకటరమణయ్య కోరారు. శుక్రవారం పట్టణంలోని 27 వేలం కేంద్రంలో రైతు సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాల వెంకట రమణయ్య మాట్లాడుతూ పొగాకు సరాసరి ధర 180 రూపాయలు తగ్గకుండా చూడాలని అన్నారు. రైతులు అమ్మకం నందు గ్రేడ్ సక్రమంగా చేయించి బేల్లలను అమ్మకమునకు తెచ్చి మంచి ధర రాబట్టుకోవాలి అన్నారు. ఇండెంట్ ఇచ్చిన ప్రతి వ్యాపారస్తుడు తొలి రోజు నుండే వేలంలో పాల్గొనాలని అన్నారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు 27వ వేలం కేంద్ర అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని, రైతుల రిజిస్ట్రేషన్ నందు జాప్యం చేస్తున్నారని, వ్యాపారస్తులు రైతులు సిబ్బంది మధ్య ఘర్షణ ఉన్నాయని ప్రధాన అధికారి ని తక్షణమే బదిలీ చేయాలని రైతులు కోరినట్లుగా పత్రికలో ప్రకటించారని, దానిలో ఎలాంటి వాస్తవం లేదని రైతు సంఘం కొట్టిపారేసింది. ఎటువంటి రైతు వ్యతిరేక కార్యక్రమాలు ఇక్కడ జరగడం లేదని, ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే రైతు సంఘం రైతుల దృష్టికి తీసుకువస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాల వెంకటరమణయ్య, వడ్లమూడి రామకృష్ణ, తానికొండ రమణయ్య, మల్లికార్జున, కృష్ణారెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment