పశువుల కృత్రిమ గర్భధారణ పై అవగాహన కార్యక్రమం
పెన్ పవర్, కందుకూరు
శుక్రవారం మండలంలోని పలుకూరు గ్రామములో జాతీయ కృత్రిమ గర్భదారణ కార్యక్రమము పై రైతులకు అవగాహన, పశువుల లో పునరుత్పత్తి పెంచుటకు కోవూరు పశు వైద్య అధికారి డాక్టర్ యస్.సుధాకర్ అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.కార్యక్రమములో ముఖ్య అతిథిగా కందుకూరు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఆర్. రమేష్ పాల్గొని మాట్లాడుతూ జాతీయ కృత్రిమ గర్భదారణ కార్యక్రమము పలుకురు గ్రామములో గేదలకు గర్భకోశ వ్యాధులు ఉండి దీర్ఘకాలికంగా తిరగ కడుతున్న, యదకు రాని గెదలకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశాము అని తెలియజేశారు. పశువుల లో సాధారణ వ్యాధులు , దూడలకు నట్టల నివారణ మందులు పరీక్షించి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో మాచవరం పశువైద్య అధికారి డాక్టర్ యి. చెన్నకేశవులు రైతులకు పశువుల లో వచ్చు వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. పశువైద్య సహాయకులు చైతన్య ,వేణు, విజయ సాగర్, గోపాల మిత్రులు శోభన్ బాబు, మురళి మోహన్ , గ్రామ పెద్దలు ఈదర. రవి , వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు .

No comments:
Post a Comment