కృత్రిమ గర్భధారణ పై పశుపోషకులకు అవగాహన
పెన్ పవర్,వలేటివారిపాలెంమండలంలోని చుండి గ్రామంలో జాతీయ కృత్రిమ గర్భదారణ కార్యక్రమము పై పశుపోషకులకు అవగాహన శుక్రవారం నిర్వహించారు. పోకూరు పశు వైద్యాధికారి డాక్టర్ జె శివరామకృష్ణ అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా వలేటివారిపాలెం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కె వి బ్రహ్మయ్య పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో పోకూరు పశువైద్యులు మాట్లాడుతూ ఈ పధకం కింద గ్రామంలో 300 పశువుల కు ఎద సూదులు చేసి 100మేలు జాతి దూడలను పుట్టించడమే ఈ పధకం ముఖ్య ఉద్దేశం అన్నారు. సాధారణ వ్యాధులు , దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. సర్పంచ్ ఇరపని సతీష్ మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ అమలు చేస్తున్న పధకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పధకాల సద్వినియోగం తో మేలుజాతి పశు సంపదను పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం సహాయ సంచాలకులు డాక్టర్ బ్రహ్మయ్య రైతులకు పశువుల లో వచ్చు వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. పశుసంవర్ధక శాఖ సహాయకులు కిరణ్, రమేష్,తిరుణ్, అశోక్, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment