గ్రామ సమస్యలు పై దృష్టి సారించిన గ్రామ పెద్దలు
తాళ్ళపూడి, పెన్ పవర్
తాళ్ళపూడి మండలంలో ప్రక్కిలంక పంచాయితీ పరిధిలోని పైడిమెట్ట గ్రామ సమస్యలపై దృష్టి సారించారు వైసీపీ నియోజకవర్గ ఎస్ సి సెల్ అధ్యక్షులు యాళ్ళ బాబురావు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ప్రక్కిలంక పంచాయితీ నుండి బాబురావు కుమార్తె స్వప్న సర్పంచ్ గా ఎన్నిక కావడం తెలిసిందే. బుధవారం ఉదయం స్థానిక వార్డు మెంబర్లు కొప్పాక గ్రేస్ కుమారి, కొడమంచిలి రేఖ ల సమక్షంలో గ్రామ పెద్దలతో బాబురావు సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటుగా గ్రామంలో ఉన్న మౌళిక సమస్యల గూర్చి చర్చించారు. కార్యక్రమంలో గ్రామ వైసీపీ కన్వీనర్ కొల్లి దుర్గారావు, మాజీ వార్డు మెంబర్ జొన్నకూటి జార్జ్, కొప్పాక సురేష్, జొన్నకూటి నాగేశ్వరరావు, పసలపూడి ఆశీర్వాదం , కొప్పాక సురేష్, జొన్నకూటి రాము, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment