పెద్దాపురం మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం
పెద్దాపురం,పెన్ పవర్పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా 29 వార్డులో నమోదైన 40,559 మంది ఓటర్లు లో 28,736 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 70.85 శాతం పోలింగ్ నమోదైందని మున్సిపల్ ప్రత్యేక అధికారి మరియు ఆర్డిఓ యస్. మల్లిబాబు బుధవారం పాత్రికేయులతో చెప్పారు. పోలింగ్ సరళిని గురించి మాట్లాడుతూ 29 వార్డుల్లో ఉదయం 9 గంటలకు 7701ఓటర్లు గాను, 18.99 శాతం , 11 గంటలకు 16630 మంది ఓటర్లు కు 41 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 2290 మంది ఓటర్లు కు 54.96 శాతం , మద్యాన్నం 3 గంటలకు 26051 మంది ఓటర్లు కు 64.23 శాతం సాయంత్రం 5 గంటలకు 28736 మంది ఓటర్లు కు 70.85 శాతం పట్టణ ఓటర్లు తమ ఓటు ను వినియోగించుకున్నారని ఆర్డిఓ తెలిపారు.బుధవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఉదయం 7 గం.లకు పోలింగ్ ప్రారంభం నుండే ఓటర్లు ఉత్సహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల అధికారి మరియు మున్సిపల్ కమీషనర్ జి. సురేంద్ర మాట్లాడుతూ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ అంబేద్కర్ పాత పెద్దాపురం లో ఉన్న పోలింగ్ బూత్ లను పరిశీలించడం జరిగిందని తెలిపారు అలాగే ఆర్డిఓ మరియు మున్సిపల్ స్పెషల్ అధికారి ఎస్ మల్లి బాబు పోలింగ్ బూతుల పరిశీలించి తగు సూచనలు ఇచ్చారని తెలిపారు. పోలింగ్ పక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు సిబ్బంది ఎంతో కృషి చేశారని, వృద్ధులు వికలాంగులు, యూత్ అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారని .పోలింగ్ కు సహకరించిన పట్టణ ఓటర్లు కు,మున్సిపల్, రెవెన్యూ ,పోలీస్ ,అధికారులు,సిబ్బందికి, వివిధ రాజకీయ పార్టీలకు కమిషనర్ జి సురేంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

No comments:
Post a Comment