సింగరేణి పరిరక్షణ టీఎన్టీయుసీ తోనే సాధ్యం
మందమర్రి, పెన్ పవర్
సింగరేణి సంస్థ పరిరక్షణ తెలుగుదేశం పార్టీ అనుబంధ టిఎన్టియుసి తోనే సాధ్యమని టిఎన్టియుసి కేంద్ర ఉపాధ్యక్షులు ఠాకూర్ మణిరాంసింగ్ పేర్కొన్నారు. బుధవారం మందమర్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సింగరేణి సంస్థ గతంలో నష్టాల బాట పట్టినప్పుడు సంస్థకు మారిటోరియం కల్పించి సంస్థను పరిరక్షించారని, అదే విధంగా సంస్థకు లాభాలు వస్తే కార్మికులకు లాభాల వాటా చెల్లిస్తానని మాట ఇచ్చి, ఇచ్చిన మాట ప్రకారం కార్మికులు లాభాల వాట చెల్లించాడని, నేటికీ కార్మికుల లాభాల వాట కల్పనకు చంద్రబాబే కారణమని పేర్కొన్నారు. సింగరేణిలో గతంలో లక్ష 16 వేల మంది కార్మికులు ఉండగా ప్రస్తుతం 42 వేల మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారని, సుమారు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు సింగరేణి ఆరో దఫా గుర్తింపు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నూతన భూగర్భ గనుల ప్రారంభించి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలని కోరారు. సింగరేణి కార్మికులకు ఐటి మినహాయింపు కొరకు తెలంగాణ ప్రాంత ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేయాలని, రాష్ట్ర పరిధిలోని అలవెన్స్ లపై ఐటి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంస్థలో అన్ని రకాల పనులు చేసే జనరల్ మజ్దూర్ కార్మికులను ఎంజేడబ్ల్యు కేటగిరి అమలు చేయాలని అన్నారు. త్వరలో 11వ వేజ్ బోర్డ్ కాలపరిమితి ప్రారంభం కాబోతుంది కావున జాతీయ సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గడువులోపు వేజ్ బోర్డును పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమానుల్లాఖాన్, ఎండి జాఫర్, జక్కుల సమ్మయ్య, బైరాజు శ్రీనివాస్, వాసాల సాగర్, కల్లేపల్లి సాగర్, ఎదులపురం సతీష్, ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment