Followers

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

 అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

మందమర్రి, పెన్ పవర్

ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం సావిత్రి భాయ్ పూలే 124వ వర్ధంతిని నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కన్వీనర్ మొయ్య రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతిని నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ, దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా బడుగు, బలహీన వర్గాలకు సేవలు అందించండంతో పాటు, వారికి చదువు అవశ్యకతను వివరించి విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో పూలే దంపతులు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కో కన్వీనర్ సకినాల శంకర్, కలీం, రాష్ట్ర కార్యదర్శి పాత వీరస్వామి, నాయకులు కనకం రవీందర్, గిన్నారపు రవి, కల్వల శంకర్, అనిల్, జూపాక సంపత్, ఉప్పులేటి నరేష్, మొగిలి, శ్రీనివాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...