నేను కాలుతూనే...నీ జీవితాన్ని కాలుస్తా...(సిగరెట్టు)
రామకృష్ణాపూర్, పెన్ పవర్
ధూమపాన రహిత దినోత్సవం సందర్భంగా యువతలో ధూమపానం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కలిగిస్తూ, కరపత్రాలను ఆరోగ్య హక్కు వేదిక ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలో బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షులు మోతె రాజలింగు మాట్లాడుతూ, సరదాగా సిగరెట్టు తాగకూడదని, ఒకసారి అలవాటైతే బానిసత్వమే నని ఆయన అన్నారు. వివిధ రకాలైన క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని, సిగరెట్టు కాలుతూ మన జీవితాలను కాలుస్తుందని ఆయన తెలిపారు. వేదిక ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించి యువతలో అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు కల్వాడి గణ శ్యామ్, వేల్పుల వెంకట స్వామి, కడమంచి సాయి, బూర్ల పవన్, వాజి అనికేత్, వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment