Followers

కువేట్లో చికుక్కున్న బాధితులను ఆదుకున్న ఎం.పి,రామ్మోహన్ నాయుడు

 కువేట్లో చికుక్కున్న బాధితులను ఆదుకున్న ఎం.పి,రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, పెన్ పవర్

శ్రీకాకుళం కు చెందిన బాబు రావు సారా, గుంటూ పూర్ణచందన్  రావు, లోకనందం భీమా రావు అనే ముగ్గురు యువకులతో పాటు, వైజాగ్ కు చెందిన నాగూర్ మీరా, మరియు మిగితా రాష్ట్రాలకు చెందిన మరో నలుగురు యువకులుమర్చంట్ నేవీ లో ఉపాధి కోసం కువైట్ కు వెళ్లి, ఆ దేశపు కోవిడ్ లొక్డౌన్ వల్ల దాదాపు 10 నెలల పాటు అక్కడే చిక్కుకుపోయారు. 2020 నవంబర్ నెల నించి కువైట్లోని భారత రాయిబారి కార్యాలయానికి దరకాస్తులు అందిస్తూ, ఫోన్లు చేస్తూ వున్నా, ఆశించిన ఫలితం దొరక్క, వారి జిల్లా అయిన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కి బాధితులు తమను ఆదుకోమని 2021 ఫిబ్రవరి లో ఇమెయిల్ పంపారు. ఎం.పి, ఆ ఇమెయిల్ కు వెంటనే స్పందించి, తిరిగి క్షేమంగా భారత దేశానికి రావడానికి బాధితులకు సహాయం చేయమని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ కి వెంటనే లేఖ రాశారు. వారికి కువైట్ లో వున్న భారతీయ రాయబార కార్యాలయం సహాయం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ లేఖను ట్విట్టర్ లో కూడా పెట్టారు.అంతటితో వదిలేయకుండా, ఎం.పి, ఈ యువకులతో వీడియో కాల్ లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కువైట్ లో ఉన్న తెలుగు సంఘాల ఐక్య వేదిక ప్రతినిధి నరసింహ నాయుడుని సంప్రదించి, అక్కడ చిక్కుకున్న వారి యోగక్షేమాల కనుక్కోని వారికి కావలసిన సహాయ సహకారాలు అందించమని కోరారు. రామ్మోహన్ నాయుడు  కువైట్లోని భారత రాయిబారి కార్యాలయం అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించడం వలన, సంభందిత అధికారులు వీరిని భారత దేశానికి పంపించే ప్రక్రియను వేగవంతం చేసారు. ఎం.పి, ని ఇమెయిల్ ద్వారా సంప్రదించి నెల రోజులు తిరక్కుండానే బాధితులు అందరు మార్చ్ 5వ తేదీన భారత దేశం చేరుకున్నారు. స్వదేశానికి చేరుకున్న వెంటనే బాధితులు మాట్లాడుతూ, స్వదేశానికి తిరిగి వస్తామున్న నమ్మకం అప్పుడు లేదని, ఎం.పి,చొరవ వలనే మేము క్షేమంగా మా స్వగ్రామాలకు చేరుకున్నామని, జీవితాంతం ఎం.పి, చేసిన సహాయం మరువమని కుటుంబ సభ్యులతో వొచ్చి ఎం.పి, కి కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...