Followers

శారీరక,మానసిక దృఢత్వానికీ జ్ఞాన దీక్షలు ఉపయోగకరం

 శారీరక,మానసిక దృఢత్వానికీ జ్ఞాన దీక్షలు ఉపయోగకరం

పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్

మందమర్రి,.పెన్ పవర్


మనిషి శారీరక,మానసిక దృఢత్వానికీ జ్ఞాన దీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని మందమర్రి పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో స్వేరోస్, స్వేరో అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని మార్చి 15న పెద్దపెల్లి జిల్లా దూళీకట్ట బౌద్ధారామం వద్ద  నిర్వహించు జ్ఞానం కోసం భీమ్ దీక్ష కార్యక్రమం వాల్ పోస్టర్ లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్ఞాన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ జ్ఞాన దీక్ష చేపట్టాలన్నారు. తెలంగాణ స్కూల్స్, పేరెంట్స్ అసోసియేషన్(టీఎస్పిఎ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ మాట్లాడుతూ, ఈ దీక్షా కార్యక్రమానికి తెలంగాణ ఎస్సీ,ఎస్టీ గురుకులాల కార్యదర్శి స్వేరోస్ నెట్వర్క్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(ఐపీఎస్, అడిషనల్ డిజిపి) హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోనే స్వేరోస్,స్వేరో అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్పిఎ జిల్లా కార్యదర్శి తోకలు నిరోష,మండల అధ్యక్షులు పులిపాక శ్రీనివాస్, సభ్యులు దుర్గ భవాని, నాగమ్మ, వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...