Followers

కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు

కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి

విజయనగరం,పెన్ పవర్

 నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రేపు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ ఎస్ ఎస్ వర్మ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం నమూనా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా కౌంటింగ్ సిబ్బందికి విధి విధానాలను విశదపరిచారు. మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాలని, ఆ తర్వాత రెండు విడతలుగా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. బ్యాలెట్ బాక్స్ నుండి  ఓట్లు లెక్కించే విధానం తదితర అంశాలపై సోదాహరణగా వివరించారు. 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రేపు ఉదయం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏడు గంటలకు ప్రారంభమవుతుందని, ఆ సమయానికి ఎన్నికల సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు రాజీవ్ క్రీడా మైదానానికి చేరుకోవాలని చెప్పారు. మొత్తం 25 కౌంటర్లు అమర్చామన్నారు. రెండు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. 25 వార్డులకు తొలి కౌంటింగ్, మరో 25 వార్టులకు మలి కౌంటంగ్ చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఏ ఒక్కరూ లెక్కింపు కేంద్రానికి సెల్ఫోన్లు, వాటర్ బాటిల్స్, ఇతర ఏ వస్తువులు తీసుకుని రాకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ ప్రసాద్ రావు, తహసిల్దార్ ప్రభాకర్ రావు, రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...