తాళ్ళపూడిలో వైభవంగా లింగోద్భవ జ్యోతి దర్శనం
తాళ్లపూడి లో మహా శివరాత్రి లింగోద్భవ జ్యోతి దర్శనం భక్తులకు కనువిందు చేసింది. మహా శివరాత్రి వేడుకలను గురువారం గంగా పార్వతీ సమేత గౌత మేశ్వర స్వామి సన్నిధి లో విన్నూత్న రీతిలో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ పశ్చిమగోదావరి జిల్లా వారిచే పార్వతీ కల్యాణం హరికథ ,గో పూజ, ప్రసాద వితరణ జరిగింది. హరికథా భాగవతారిణి కి మహిళా సభ్యులు సన్మానం చేసారు. లోల్లా భట్ ఉమా మహేశ్వర బాల భక్త భజన మండలి సభ్యులు, గౌతమేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ అభివృద్ధి కమిటీ, గణపతి యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యం లో మహా శివరాత్రి వేడుకలను టి.టి.డి.పురాణ ఉపన్యాసకులు పరస రాధా కృష్ణ జాగరణ పూజలు నిర్వహించారు. సీతా రాముల తో కూడిన ద్వాదశ జ్యోతిర్లింగాలను ఊరేగింపు గా తీసుకు వచ్చి సామూహిక పూజలు,అభిషేకాలు జరిపారు.లింగోద్భవ సమయంలో అర్ధ రాత్రి పన్నెండు గంటలకు ముప్పై అడుగుల ఎత్తులో ఒకే రీతిలో మూడు నిమిషాలు వెలిగే లింగోద్భవ జ్యోతి ని వెలిగించారు. వందలాది భక్తులు జ్యోతిని దర్శిస్తూ శివ నామ స్మరణ చేసారు. పరస రాధా కృష్ణ వ్యాఖ్యానం చేసారు.కవల శ్రీనివాస్, శింగం శివ రామ కృష్ణ, డివివి సత్య నారాయణ, కిల్లాని లక్ష్మణ రావు,రేకపల్లి వీరాస్వామి, జగన్నాధం మాస్టారు, దూడల గోపాల రావు, కాసాని వేంకటేశ్వరరావు, అప్పారావు, తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

No comments:
Post a Comment