గజ్జరం సర్పంచ్ గండి రాంబాబు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం
తాళ్ళపూడి, పెన్ పవర్
గజ్జరం గ్రామంలో వైయస్సార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెంటర్ లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గ్రామ సర్పంచ్ గండి రాంబాబు పూలమాల వేసారు. అనంతరం గ్రామ కన్వీనర్ గన్నిన రత్నాజీ, నాయకులు వల్లభనేని శ్రీహరి, కాకర్ల చంద్రశేఖ, గుంటు చిన్నబ్బాయి, మరియు వైయస్సార్సీపీ కార్యకర్తలు తమ అభిమాన నాయకులకు పూల మాలలు వేసారు. వచ్చిన నాయకులు, కార్యకర్తలు పార్టీ పట్ల వారికున్న ప్రేమాభిమానాన్ని స్వీట్స్ పంచి చాటుకున్నారు. అనంతరం పంచాయతీ ఆఫీస్ నందు నాయకులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూల మాలలతో తమ అభిమానాన్ని ఘనంగా చాటారు.

No comments:
Post a Comment