డ్రైన్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా ఉండాలి
పెన్ పవర్,ఆలమూరు
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది నిర్మాణాలు వేగవంతంగా జరగాలని ఆలమూరు మండల ప్రజాపరిషత్తు పరిపాలనాధికారి టి వి సురేందర్ రెడ్డి అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం నర్సపూడి గ్రామంలో 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులను ఆయనతో పాటు ఆ గ్రామ పంచాయితీ కార్యదర్శి పి రాజుతో కలిసి పరిశీలించారు. డ్రైన్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారులను అదేశించారు. డ్రెయిన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కందిబొట్ల శ్రీను, వైఎస్సార్ సిపి నాయకులు చల్లా సుబ్రహ్మణ్య (సుబ్బయ్య), ఉండమట్ల వెంకటేశ్వరరావు (అబ్బు) వైసిపి కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

No comments:
Post a Comment