తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి
కూకట్ పల్లి,పెన్ పవర్
ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూకట్ పల్లి తెలుగుదేశం కార్యకర్తలు తమ అభ్యర్థి గెలుపు కొరకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ మహా నగరానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని, హైటెక్ సిటీ నిర్మాణంతో లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించామని అన్నారు. తెరాస ప్రభుత్వ పాలనలో ఉద్యోగ అవకాశాలు లేక యువత, నిరుద్యోగులు అల్లడిపోతున్నారని, పట్టభద్రులు ఆలోచించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగ సమస్యలు ఉండవని అన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి ఎల్ రమణకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈకార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పద్మా చౌదరి, డివిజన్ అధ్యక్షులు షేక్ సత్తర్, సీనియర్ నాయకులు రామకృష్ణ, రేఖ, ఉమా, రమేష్ తుమ్మల, డివిజన్ తెలుగు యువత అధ్యక్షుడు గోపి, వర్మ, తదితరులు పాల్గొన్నారు .

No comments:
Post a Comment