Followers

దేశంలో రాజమండ్రి కి కీర్తి తెచ్చిన జిత్ మోహన్ మిత్రా

దేశంలో రాజమండ్రి కి కీర్తి తెచ్చిన జిత్ మోహన్ మిత్రా

రాజమండ్రి, పెన్ పవర్

 దేశ వ్యాప్తంగా వేలాది స్వర విభావరులు నిర్వహించిన ప్రముఖ గాయకుడు జిత్ మోహన్ మిత్ర రాజమండ్రి నివాసి కావడం రాజమండ్రి కే గర్వ కారణం అని ఎపిఐఐసి పూర్వ చైర్మన్ శ్రీ శిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం  కీర్తించారు. వయసు పెరుగుతున్నప్పటికీ హుషారు పెరుగుతున్న ఏకైక వ్యక్తి జిత్ మాత్రమే అని ఆయన అభినందించారు.నటుడు, గాయకుడు జిత్ మోహన్ మిత్ర 79 వ పుట్టిన రోజును పురస్కరించుకుని సిపి బ్రౌను మందిరం మంగళవారం ఉదయం నిర్వహించిన సత్కార సభలో శివరామ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. బ్రౌను మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, జిత్ మోహన్ మిత్రాను చూడగానే రోగ గ్రస్ధులు సైతం ఆరోగ్య వంతులుగా మారిపోతారని అన్నారు. హ్యూమరస్ కి‌ మారు పేరు జిత్తు మోహన్ మిత్రా అని శివరామ సుబ్రహ్మణ్యం అభివర్ణించారు. భారత దేశంలో  ఒక గాయకుడు ఎవరైనా అద్భుతాలు సాధిస్తే అది జిత్ మోహన్ మిత్ర మాత్రమే అని ఆయన పేర్కొన్నారు.యాభై ఏడు సంవత్సరాల నుంచీ‌ నిరాఘాటంగా ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్న వ్యక్తిని తాను మాత్రమే అని జిత్ మోహన్ మిత్రా తన కృతజ్ఞతా ప్రసంగంలో వెల్లడించారు. 1954 వ సంవత్సరంలో ఆర్కెస్ట్రా ప్రారంభించిన తాను, దేశంలోని వివిధ రాష్ట్రాలలో  మొత్తం ఆరువేల సంగీత విభావరులు నిర్వహించానని చెప్పారు.  సంగీతానికి ఉన్న బలం‌ అంతా ఇంతా కాదని ఆయన అన్నారు. 1950 దశకంలో మల్లీశ్వరి, పాతాళ భైరవి, హిందీ చిత్రం ఆవారా విడుదలయి, రికార్డులను బద్దలు కొట్టాయని తెలిపారు. ఆవారాలోని పాట ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిందని, అటు వంటి పాటలు తాను వేల సంఖ్యలో పాడానని జిత్ వెల్లడించారు.రష్యాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ ముస్లిం ప్రధాని ఆవారాలోని పాట పాడడం అప్పట్లో ప్రపంచంలోనే సంచలనం కలిగించిందన్నారు. హిందీ పాట ఎందుకు‌ పాడారని కొందరు ప్రశ్నించగా, తాను భాషను చూడనని సంగీత శ్రవణమే కీలకమని ఆ ప్రధాని చెప్పినట్లు జిత్ ఈ సందర్భంలో‌ పేర్కొన్నారు. జిత్మోహన్ మిత్రాను సన్నిధానం శాస్త్రి, శివరామ సుబ్రహ్మణ్యం సన్మానించారు. పింగళి వెంకయ్య మనుమడు ఘంటసాల గోపీ కృష్ణ, సన్నిధానం శాస్త్రి, ప్రసాదుల హరనాధ్ తదితరులు జిత్ గాన ఘనతను శ్లాఘించారు.కార్యక్రమంలో దూర్వాసుల సత్యనారాయణ, నందం స్వామి, తణుకు గోపాలకృష్ణ,  మాదేటి రవిప్రకాష్, నిమిషకవి వెంకటేష్, సుబాష్, జిలాని, రెడ్డి పార్వతి, సౌమ్య, జి.పార్వతి పొక్కులూరి రామ్మూర్తి, ఆదినారాయణ జి.భార్గవి, భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...