ఘనంగా యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం
కొవ్వూరు, పెన్ పవర్
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె.నారాయణ్ నాయక్ ఆదేశాల ప్రకారం, కొవ్వూరు డి.ఎస్.పి బి.శ్రీ నాథ్, కొవ్వూరు టౌన్ సి.ఐ ఎం.వి.వి.యస్.ఎన్ మూర్తి ఆధ్వర్యంలో కొవ్వూరు ఏ.బి.ఎన్ కళాశాలలో కోవిడ్ నియమాలుకు అనుగుణంగా యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించటం జరిగినది.డి.ఎస్.పి - బి .శ్రీనాథ్ మాట్లాడుతూ యువత మత్తు బారిన పడకుడదనీ, డ్రగ్స్ వలన కలిగే అనేక అనర్ధాలు గురించి వివరించారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లలను కళాశాలలకు బాగా చదువుకోమని పంపిస్తూ ఉంటే చెడు స్నేహాల వల్ల యువత పక్కదారి పడుతోందని పేర్కొన్నారు. యువత తల్లిదండ్రుల ఆశయాలకు లోబడి, గురువులు చెప్పిన అంశాలను శ్రద్ధతో విని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పేర్కొన్నారు.తల్లిదండ్రులు, గురువులు చెప్పిన విషయాలను పెడచెవిని పెట్టి, అసాంఘిక శక్తులతో కలిసి తిరిగి నట్లయితే విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనమవుతుందని పేర్కొన్నారు. కాబట్టి విద్యార్థుల జీవితాలను నాశనం చేసే డ్రగ్స్ విషయంలో దూరంగా ఉండాలని ఆయన కోరారు.డ్రగ్స్ నివారణలో యువత మరియు ప్రజలు, పోలీస్ వారికి ఎల్లప్పుడూ సహకరించాలి అని కోరారు.సమాజ శ్రేయస్సు కొరకు పోలీసులు, మీకు అన్ని వేళల ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీఎన్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, కొవ్వూరు టౌన్ ఎస్.ఐ - కె.వెంకట రమణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment