రాష్ట్ర చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు
పెన్ పవర్,తాడేపల్లిగూడెం
రాష్ట్ర చరిత్రకు,రాష్ట్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టిన రోజని స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ పథకాల హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ అన్నారు.తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి జెండాను ఎగురవేసి,వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రని మలుపుతిప్పిన సుదినం ఈ రోజు అని, పార్టీ స్థాపించి 10 వసంతాలు పూర్తిచేసుకున్న ఈ రోజు పార్టీ శ్రేణులకు పండుగరోజు అని అన్నారు.రాష్ట్ర ప్రజల అసలు,ఆశయాలకు జీవం పోసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేసి పార్టీని ప్రజల మనస్సుల్లో నిలబెట్టారని అన్నారు.
ప్రజాసంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ వైయస్సార్ పార్టీ అన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటికి తీసుకొచ్చి అందిస్తున్నామని అన్నారు.యువనేత కొట్టు విశాల్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా యువతకు ఉద్యోగాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.11వసంతంలోకి అడుగుపెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమమంలో వైస్సార్సీపీ యువనేత కొట్టు విశాల్,కర్రీ భాస్కరరావు,గుండుబోగుల నాగు,ముప్పిడి సంపత్ కుమార్,తెన్నేటి జగజీవన్,సింగం సుబ్బారావు,గుండెమొగుల బలుసులు,మండా పద్మావతి,బొలెం రామలక్ష్మి,శెట్టి రమాదేవి,ముద్రగడ లలిత,నీలం నాగ భూషనం,బొడ్డు సాయిబాబా,నలిమిల్లి అంజిరెడ్డి,కాకర్ల శ్రీనివాస్,తాళ్లూరి మురళి,పత్సమట్ల సావిత్రి,కొవ్వూరి భాస్కర్ రెడ్డి చింతా శ్రీనివాస్,గురజాడ బ్రహ్మాజీ,కట్టుబోయిన కృష్ణ ప్రసాద్,పాలకోడేటి సురేష్,సిర్రాపు శాంత కుమార్,వీర్ల గోవింద్,చింతకాయల సత్యనారాయణ,కొలుకులూరి ధర్మరాజు,శిరిగినీడి విజయకృష్ణ,వట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment