అధికారం చేపట్టి అతి స్వల్ప కాలంలోనే ప్రజల మన్నలను పొందాం
పెన్ పవర్,ఆలమూరు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పది వసంతాలు పూర్తిచేసుకుని ఈ రోజు (మార్చి 12వ తేదీ)న 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టి అతి స్వల్ప కాలంలోనే ప్రజల మన్నలను పొందామని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ అన్నారు. మండల పరిధి లో చెముడులంక, ఆలమూరు, మడికి గ్రామాల్లో గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తమ్మన మాట్లాడుతూ జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మన పార్టీ గడచిన పదేళ్ళలో ఎన్నో సవాళ్ళను అధిగమించి సంపూర్ణ ప్రజా బలంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అధికారం చేపట్టిన 20 నెలల అతి స్వల్ప కాలంలోనే పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో 90 శాతాన్ని మన పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు పరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచుతూ నాయకులు కార్యకర్తలు గర్వంగా తలెత్తుకు తిరిగేలా తిరుగులేని పాలన అందిస్తున్నారని అన్నారు. అందుకు తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే తగిన ఉదాహరణ అని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందన్న వాస్తవం మీ అందరికీ తెలిసిందేనని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల ప్రజలంతా కలిసి ఒక పండుగలా జరుపుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం వృద్ధులకు నూతన వస్త్రాలతో పాటు పండ్లును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడమటి రాంబాబు, మల్లెమొగ్గలు చిన్న, రావుల దుర్గాప్రసాద్, కంచుమర్తి బాబులు, పాల్గొన్నారు. అలాగే చొప్పెల్ల గ్రామంలో తోరాటి లక్ష్మణ్రావు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

No comments:
Post a Comment