Followers

తాళ్ళపూడిలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

 తాళ్ళపూడిలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

తాళ్ళపూడి, పెన్ పవర్

ఆదివారం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ, తాళ్లపూడి శాఖ ఆధ్వర్యంలో  తాళ్లపూడి బస్టాండ్ వద్ద గల కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం లో  రాజమండ్రి గౌతమి నేత్రాలయం,  అర్జున్ గైనిక్, సన్ స్టార్ వారి సౌజన్యం తో  ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. శిబిరాన్ని మండల గౌరవ ఛైర్మన్ సింహాద్రి జనార్దన్ రావు  ప్రారంభించారు. శిబిరానికి సుమారు 300మంది హాజరయ్యారు.  అందులో ఇరవై మందికి  కళ్ళ శస్త్ర చికిత్సలు అవసరమని వారిని ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్ కి తీసుకువెళ్లామని గౌతమి నేత్రాలయం ప్రోగ్రాం మేనేజర్ ఆంజనేయులు తెలిపారు.  అవసరమైన 70మందికి కళ్ళజోడ్లు సూచించామని  తెలిపారు.  కళ్ళజోడు అవసరమైన వారందరికి తానే ఉచితంగా అందజేస్తానని ఛైర్మన్ సింహాద్రి జనార్ధనరావు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బారనాల శంకరరావు, రీజనల్ ఛైర్మన్ వాసిబోయిన చంద్రయ్య, ఉపాధ్యక్షులు తుంపూడి నాగభూషణ గుప్త,  కోశాధికారి చెరుకు ఆంజనేయులు,  మాజీ అధ్యక్షులు అప్పన చంద్రధర గుప్త, రుక్మాంగధ ఆవాల, సభ్యులు డెంటిస్ట్ జి.సాగర్, ఈసి మెంబర్ గెడ్డం రమా సత్యనారాయణ, గంధం మునేశ్వరరావు, సీనియర్ సభ్యులు గెడ్డం సాయిబాబా, మాజీ అధ్యక్షులు మాధవరపు రామచంద్రరావు, శాశ్వత సభ్యులు దుగ్గిరాల సూర్యనారాయణ, కరిబండి డిగ్రీ కాలేజ్  ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కోఆర్డినేటర్ డి.మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...