Followers

హోంమంత్రి పై మండిపడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు

 హోంమంత్రి పై మండిపడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు

కూకట్ పల్లి,పెన్ పవర్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని ప్రతిభ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ను బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హోంమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి పదవిలో ఉంటూ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని బయటికి వచ్చి పలానా అభ్యర్థికి ఓటు వేశాము, మీరు కూడా ఆ అభ్యర్థికే ఓటు వేయండి అని చెప్పడం దేశ చరిత్రలో ఇంత వరకు ఎక్కడా జరిగిన దాఖలాలు లేవని,అధికార పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పోలింగ్ బూత్ వద్ద గులాబీ రంగు దుస్తులు ధరించి   తిరుగుతున్నా సరే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నో ఎలక్షన్ లు చూసిన అధికార పార్టీకి బుద్ధి లేదా అని రామచంద్ర రావు ప్రశ్నించారు. భారీ సంఖ్యలో పట్టభద్రులు ఈసారి జరుగుతున్న ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని,  పోలింగ్ కేంద్రాల్లో ఒక్క క్యాబిన్ ను ఏర్పటు చేయడం వల్ల ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...