Followers

రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

 రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

వేములవాడ,పెన్ పవర్

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తజనంతో ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. రాష్ట్ర నలుమూలల నుండి రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులు సర్వదర్శనం, కోడె మొక్కుల క్యూలైన్ల మీదుగా ఆలయంలో చేరుకుని తన ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 30 వేల మంది కి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని తరించినట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...