Followers

ప్రభుత్వానికి కాపులపట్ల వివక్ష తగదు

 ప్రభుత్వానికి కాపులపట్ల వివక్ష తగదు

పెన్ పవర్,రావులపాలెం

కాపు కార్పొరేషన్ విదేశీ విద్య దీవెన పథకం ద్వారా విదేశాలలో చదువుకుంటున్న వందలాది మంది పేద కాపు విద్యార్థులకు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి గత 20 మాసాలు గడిచినా  ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదో సమాధానం చెప్పాలని బిజెపి రాష్ట్ర టెలికం సెల్ కన్వీనర్  పాలూరి సత్యానందం డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కొత్తపేటలో మాట్లాడుతూ ఎస్సీ విద్యార్థులకు చెందిన అంబేద్కర్ విదేశీ విద్యా నిధికి జగన్ ప్రభుత్వం డిసెంబర్ 5న 25 కోట్ల రూపాయలు విడుదల చేయడం హర్శించదగ్గ విషయమని, అయితే కాపు విద్యార్థుల విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్ధాంతరంగా చదువులు ఆగిపోతున్న పేద కాపు విద్యార్థుల గోడు పట్టదా అని, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ఎందుకు పెదవి విప్పటం లేదో చెప్పాలని పాలూరి ప్రశ్నించారు. సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చుచేసి ఉద్దరిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ఈ జగన్ ప్రభుత్వం కాపు యువతను ఆదుకోవాలని, పెండింగ్ సొమ్ములను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలపై స్పందిస్తూ పలువురికి లేఖలు రాసే మాజీమంత్రి,  కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపు పేద విద్యార్థులకు విదేశీ విద్య దీవెన పథకం అమలు చెయ్యాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయాలని పాలూరి కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...