Followers

ప్రభుత్వ వైఫల్యాలే పోలింగ్ వృద్ధికి కారణాలు

 ప్రభుత్వ వైఫల్యాలే పోలింగ్ వృద్ధికి కారణాలు

కూకట్ పల్లి,పెన్ పవర్

హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని ప్రతిభ  స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ను సందర్శించిన టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో నమోదైన పోలింగ్ శాతంతో పోల్చుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని, పోలింగ్ శాతం పెరగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని ఆయన అన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలలో కొన్నిచోట్ల కుటుంబసభ్యుల ఓట్లను వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బూత్ లో వేయడం జరిగిందని., అయిన సరే ఓటర్లలో వచ్చిన ఓక ఆలోచన వారిని ఓటు వేసే విధంగా ముందుకు నడిపించిందని తెలిపారు. కేంద్ర  ప్రభుత్వం పన్నుల రూపంలో సామాన్య ప్రజలపై భారం వేయడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేయడం వంటి వాటిని ప్రజలు గమనిస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను రెండోసారి అధికారం వచ్చిన సరే నెరవేర్చడం లేదని, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా సదుపాయాలు కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో షేక్ సత్తార్, పద్మ చౌదరి, అట్లూరి దీపక్ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...