Followers

గంటా కృష్ణ ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 గంటా కృష్ణ ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి మండలం తాడిపూడి లో జనసేన నాయకులు మరియు తాడిపూడి పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ గంటా కృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంటా కృష్ణ పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం కేక్ కట్టింగ్ చేసి, ఈ ఉత్సవంలో పాల్గొన్న వారందరికీ స్వీట్, హాట్ పంచారు. ఈ సందర్భంగా కొంతమంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి గంటా కృష్ణ పార్టీ కండువా కప్పి, పార్టీలోని కి ఆహ్వానించడం జరిగింది. గంటా కృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా  మనమంతా కలసి పనిచేసి పార్టీని అభివృద్ధి పధంలో నడిపిస్తూ, పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను అఖండమైన మెజారిటీతో గెలిపిద్దామని అన్నారు. నాయకులంతా కలిసి పనిచేయడానికి ఇష్టతను చూపారు.  ఈ కార్యక్రమంలో ఆర్.యస్.మూర్తి, వీరిశెట్టి సీతారామయ్య,  బొక్కా నాగేంద్ర, పెండెం పోసిబాబు, అక్కాబత్తుల లక్ష్మణ్, చింతపల్లి అంజి, చెన్నా గంగయ్య, రావూరి పోసి, గుర్రాల పోసి దొరయ్య, జనసైనికులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...